టీడీపీ నేతలపై అక్రమ కేసులను డీజీపీ ఖండించాలి: కన్నా

పల్నాడు జిల్లా నరసరావుపేట జైలులో ఉన్న కార్యకర్తలను టీడీపీ నేతలు నేడు పరామర్శించారు. టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన నేతలలో కన్నా లక్ష్మీనారాయణ, కొమ్మాలపాటి శ్రీధర్, అరవింద్ బాబు తదితరులు ఉన్నారు. 

ఈ సందర్భంగా, కన్నా మీడియాతో మాట్లాడుతూ... ఆడపిల్లకు అన్యాయం జరిగిందని ప్రశ్నించినవారిపై కేసులు పెట్టారని మండిపడ్డారు. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం తప్ప జగన్ చేసింది శూన్యమని విమర్శించారు. "ఎక్కడా ప్రతిపక్షాల నోరు నొక్కడంలేదని డీజీపీ చెబుతున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులను డీజీపీ ఖండించాలి" అని డిమాండ్ చేశారు.

Kanna Lakshminarayana
DGP
Police Cases
TDP
Andhra Pradesh

More Telugu News